గోల్డ్ లోన్ తీసుకునే వాళ్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఇకపై సులువు కాదంటూ?

ప్రస్తుత కాలంలో గోల్డ్ లోన్ అనేది సేఫ్ లోన్ అనే సంగతి తెలిసిందే. గోల్డ్‌ లోన్‌ నిబంధనలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కఠిన తరం చేయబోతుందని సమాచారం అందుతోంది. ఈ రుణాల మంజూరుకు సంబంధించి కొన్ని రూల్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. రుణ గ్రహీత నిధులను ఎందుకు ఖర్చు చేయనున్నారనే విషయాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

పసిడి ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 89,000 రూపాయలు అనే సంగతి తెలిసిందే. చైనా తర్వాత బంగారం వినియోగం టాప్ లో ఉండటానికి ఇదే కారణమని సమాచారం అందుతుండటం గమనార్హం. కరోనా సమయంలో బంగారం రుణాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది.

గతంలో ఆర్బీఐ బంగారం రుణాల మంజూరు విషయంలో ఒకింత ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. రుణాల సోర్సింగ్‌, తాకట్టు బంగారం విలువ మదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్‌ టు వాల్యూ (ఎల్‌టీవీ) రేషియో, రిస్క్‌ వెయిటేజీ అంశాల్లో ఆర్బీఐ లోపాలను ఎత్తి చూపడం గమనార్హం. రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిశీలించాలని రుణదాతలను ఆర్‌బీఐ ఆదేశిస్తోంది.

పాక్షిక చెల్లింపులపై రుణ కాలపరిమితి రెన్యువల్‌నూ ఆర్‌బీఐ తప్పుబట్టడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే గోల్డ్ లోన్స్ విషయంలో ఈ తరహా నిబంధనల అమలు వల్ల లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో చూడాల్సి ఉంది.