మనలో చాలామంది దంతాల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అయితే దంతాల వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. దంతాలు పసుపు రంగులో ఉంటే అపరిశుభ్రమైనవని చాలామందిలో అపోహ ఉంటుంది. అయితే వైద్యులు మాత్రం దంతాలు పసుపురంగులో ఉంటే అది మన నిర్లక్ష్యానికి ప్రతీక అని చెబుతుండటం గమనార్హం.
పసుపు పళ్లు ఉన్నవాళ్లతో పోల్చి చూస్తే తెలుపు పళ్లు ఉన్నవాళ్లకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. నోటి సాధారణ ఆరోగ్యం పళ్ల కంటే చిగుళ్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చిగుళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దంతక్షయం, చిగురువాపులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ బ్రష్ చేయడం, ఫ్లాషింగ్ చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
తగినంత ఎనామిల్, దంతపు మందపాటి పూత ఉంటే దంతాలు ఆరోగ్యంగా ఉన్నాయనే అర్థం వస్తుంది. దంతాలు ముదురు రంగులో ఉంటే మాత్రం ధూమపానం ఎక్కువగా చేస్తున్నట్టు భావించాలి. ఫ్లోరోసిస్ వంటి కొన్ని వ్యాధుల వల్ల కూడా దంతాల రంగు మారే అవకాశాలు అయితే ఉంటాయి. బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు చేరడం వల్ల దంతాలు ఎరుపు, నలుపు, గోధమ రంగు మరకలను అభివృద్ధి చేసే ఛాన్స్ అయితే ఉంది.
దంతాలు పసుపు లేదా నల్లగా కనిపించడం ఆరోగ్య సమస్యలకు ఏ మాత్రం సంకేతం కాదు. టీ, కాఫీ, సోడా, వైన్ లకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. నోటిలో హానికరమైన మార్పులు కలిగితే దంత వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.