సెల్ఫ్ అబార్షన్ మందులు ప్రాణాలకే ప్రమాదమా.. అవి వాడితే ఏమవుతుందంటే?

ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు గర్భస్రావానికి మందులు వాడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. వైద్యుల సూచనలతో కొంతమంది ఈ మందులు వాడుతుండగా మరి కొందరు మహిళలు మాత్రం ఇష్టానుసారం ఈ మందులు వాడుతున్నారు. అయితే ఈ మందులు ఇష్టానుసారం వాడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కుటుంబ నియంత్రణకు ఇతర మార్గాలను ఎంచుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు.

అబార్షన్ మందుల వల్ల పుట్టబోయే బిడ్డ జీవితం కూడా ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. గైనకాలజిస్ట్ సలహాలు తీసుకోకుండా ఈ మందులు వాడకూడదు. మార్కెట్ లో దొరికే మందులను ఎక్కువగా వాడితే గర్భసంచి వీక్ అయ్యే అవకాశం అయితే ఉంది. రక్తహీనత సమస్య ఉంటే ఈ మందులు అస్సలు వాడకూడదు.

అబార్షన్ మందులను విక్రయించకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సూచనలు చేస్తున్నాయి. అబార్షన్ మందులు వాడటం వల్ల ఫెలోపియన్ ట్యూబ్ కు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మహిళలు ప్రెగ్నెన్సీకి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మహిళలు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పుట్టబోయే బిడ్డ ప్రాణాలు కూడా అపాయంలో పడే అవకాశం ఉంది. పెళ్లి కాని యువతులు పెళ్లికి ముందే గర్భం దాల్చితే మాత్రం ఇష్టానుసారం మందులు వాడుతూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.