ఎస్బీఐ సూపర్ స్కీమ్.. విద్యార్థులు సులువుగా 15 వేల రూపాయలు పొందే ఛాన్స్!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్బీఐ ప్రతి సంవత్సరం ఆశా స్కాలర్‌షిప్స్ పేరుతో స్కాలర్ షిప్స్ ను అందిస్తోంది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన స్కాలర్ షిప్స్ గురించి సైతం ఎస్బీఐ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు ప్రతి ఒక్కరికీ అవసరం అనే సంగతి తెలిసిందే.

చాలామంది ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోవాలనే కోరిక ఉన్నా ఉన్నత చదువులు చదివే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పైచదువులు చదవాలనే ఆశ ఉన్నప్పటికీ ఆర్ధిక పరిస్థితులు బాగాలేక వెనుకడుగు వేస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కాలర్ షిప్స్ అమలు దిశగా అడుగులు వేస్తోంది.

10,000 మందికి ఈ స్కాలర్ షిప్ అందనుందని సమాచారం అందుతోంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐ స్కాలర్ షిప్ ద్వారా విద్యార్థులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆ పథకాల వల్ల ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుండటం గమనార్హం. ఎస్బీఐ స్కాలర్ షిప్ మెరిట్ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.