ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన యూనియన్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం యూనియన్ బ్యాంక్ దరఖాస్తులను కోరుతోంది. మార్చి నెల 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేస్తే మంచిది. తెలంగాణ రాష్ట్రంలో 304 అప్రెంటీస్ ఖాళీలు ఉండగా ఏపీలో 549 ఖాళీలు ఉన్నాయి.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 2691 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
ఈ జాబ్స్ కు ఎంపికైన వాళ్లకు నెలకు 15000 రూపాయల చొప్పున స్టైఫండ్ లభించనుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుండగా 2025 సంవత్సరం మార్చి 12వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
సంస్థ అధికారిక వెబ్ సైట్, నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతుండటంతో నిరుద్యోగులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.