దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. 20 లక్షల రూపాయల వరకు సులువుగా ఎడ్యుకేషన్ లోన్ ను ఎస్బీఐ ద్వారా పొందవచ్చు. ఎవరైతే ఈ లోన్ ను తీసుకుంటారో వాళ్లు 15 సంవత్సరాల లోపు లోన్ ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉండటం విద్యార్థులకు శుభవార్త అని చెప్పవచ్చు.
అయితే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణం తీసుకునే వాళ్లు మాత్రం తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం రుణాన్ని పొందాలని భావించే వాళ్లు ఆస్తులను తనఖా పెట్టి ఈ రుణాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 8.3 శాతం నుంచి ఈ వడ్డీ రేటు ఉంటుంది కాబట్టి అవసరం అయితే మాత్రమే ఈ రుణం తీసుకుంటే మంచిది.
విదేశీ విద్యను అభ్యసించే వాళ్లు గరిష్టంగా కోటిన్నర రూపాయల వరకు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను జత చేయడం ద్వారా ఈ లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో విద్యను అభ్యసించే వాళ్లు గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కోర్సుల ఆధారంగా లోన్ పరిమితిలో మార్పులు ఉంటాయి. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించి లోన్ ను పొందవచ్చు. రోజురోజుకు ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్స్ ను అయితే పొందవచ్చు.