సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 4500 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అప్రెంటీస్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పట్టభద్రులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. జూన్ 7 నుంచి 23వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ అప్రెంటీస్ జాబ్స్ కు వ్యవధి 12 నెలలుగా ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. https://nats.education.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
20 నుంచి 28 సంవత్సరల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. నెలకు 15,000 రూపాయల చొప్పున ఈ ఉద్యోగాలకు సంబంధించి స్టైఫండ్ లభించనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 400 నుంచి 800 రూపాయల వరకు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్ నెస్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరిగే అవకాశం ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.