బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మార్చి నెల 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
సీనియర్ మేనేజర్, మేనేజర్ డెవలపర్ ఫుల్ స్టాక్, ఆఫీస్ డెవలపర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్ క్లౌడ్ ఇంజనీర్, ఆఫీసర్ ఏఐ ఇంజనీర్, మేనేజర్ ఏఐ ఇంజనీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజనీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపెర్, మేనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ డేటాబేస్ మేనేజర్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
మొత్తం 518 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీ.ఎఫ్.ఏ, ఎంబీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 48,480 రూపాయల నుంచి 1,02,300 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
ఆన్ లైన్ ద్వారా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. జనరల్, ఓబీసీ, ఈ.డబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.