ఎస్బీఐలో 5 వేల క్లర్క్,జూనియర్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూసేవాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు చెప్పింది. క్లర్క్ లేదా జూనియర్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూసేవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ త్వరలో 5000 క్లర్క్, జూనియర్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, బెంగాల్, చండీగఢ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కేరళ, జైపూర్ ప్రాంతాలలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

గతేడాది 5,008 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగగా ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అయితే అధికారికంగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆల్ ఇండియా ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 29000 రూపాయల వరకు వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.