ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. బీటెక్, డిప్లొమా అర్హతతో?

మెదక్ లో ఉన్న ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డిజైన్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

మొత్తం 8 ఉద్యోగ ఖాళీలు ఉండగా డిజైన్ ఇంజినీర్(మెకానికల్) ఉద్యోగ ఖాళీలు 4, అనాలిసిస్ ఇంజినీర్ (మెకానికల్) 1, డిజైన్ అసిస్టెంట్(మెకానికల్) 1, డిజైన్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) 1, డిజైన్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్) 1 ఉన్నాయి. డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 60,000 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ నెల 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉందని సమాచారం అందుతోంది.

జనరల్, బీసీ అభ్యర్థులు బ్యాంక్ లో 300 రూపాయలు డీడీ తీసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీడీ, విద్యార్థి సర్టిఫికెట్ల సెల్ఫ్ అటెస్టేషన్ తో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.