రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రైల్వే మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. rvnl.org వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎలాంటి పరీక్ష లేకుండానే ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 61 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుండగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 01, 2023న ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూను నిర్వహించడం జరుగుతుంది. సీనియర్ స్టేషన్ మేనేజర్, స్టేషన్ షిఫ్ట్ మేనేజర్, డిప్యూటీ క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ కంట్రోల్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
చీఫ్ ఇంటర్‌ఫేస్ కోఆర్డినేటర్, చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ఇతర ఉద్యోగ ఖాళీలు సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
విద్య, అనుభవం, కుల ధృవీకరణ పత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన ఫోటో కాఫీలను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.