కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా మోదీ సర్కార్ ప్రధానంగా రైతులు, మహిళలకు బెనిఫిట్ కలిగేలా స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. గర్భవతి అయిన మహిళకు ఆర్థిక భారం తగ్గించే దిశగా మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది.
మొదటి బిడ్డతో గర్భవతి అయిన 19 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి కేంద్రం ఈ స్కీమ్ ద్వారా 5000 రూపాయలు జమ చేయనుంది. 2017 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలవుతుంది. గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవం వరకు మూడు వాయిదాలలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. గర్భవతి యొక్క బ్యాంక్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుంది.
https://pmmvy.wcd.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్ వాడీ టీచర్ లేదా ఆయాలకు మీ యొక్క సర్టిఫికేట్లను సమర్పించడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, మొబైల్ నెం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు రెసిడెన్సీకి సంబంధించి ప్రూఫ్ జికాక్స్ పత్రాలను అందించి ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన స్కీమ్ ద్వారా తల్లులు, పాలిచ్చే మహిళలకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సమీపంలోని అంగన్ వాడీ టీచర్లను సంప్రదించి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.