మనలో చాలామంది ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు. మొదట తెల్ల రేషన్ కార్డ్ నిబంధనతో మాత్రమే ఈ స్కీమ్ అమలవుతుందని ప్రచారం జరిగినా ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లు, 1000 చదరపు అడుగుల స్థలం లేదా ఇళ్లు ఉన్నవాళ్లు, ఫోర్ వీలర్ ఉన్నవాళ్లు, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించే వాళ్లు, 10 ఎకరాల మెట్ట పొలం లేదా 3 ఎకరాల తడి పొలం కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అనర్హులు.
మంగళవారం నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. రేషన్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ యాక్టివ్ గా ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. అయితే అన్ని అర్హతలు ఉన్నా గ్యాస్ సిలిండర్ స్కీమ్ బెనిఫిట్ పొందలేని పక్షంలో జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఫోన్ నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోన్ నంబర్ ఉంటుంది కాబట్టి నివశించే జిల్లా ఆధారంగా ఫోన్ నంబర్ లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసేవాళ్లు ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ వల్ల సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారీగా బెనిఫిట్ కలగనుంది.
కూటమి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ద్వారా ప్రజల మెప్పు పొందే ప్రయత్నం అయితే జరుగుతోందని చెప్పవచ్చు. కూటమి ఈ స్కీమ్ అమలు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.