పచ్చిపాలు తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ పాలు తాగితే ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది పచ్చిపాలు తాగడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పచ్చిపాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. పాలను ఆహారంలో తీసుకోవడం వల్ల పోషకాహార లోపం సమస్యలకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. పచ్చి పాలను తాగడం వల్ల కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పాలలో మంచి ప్రోటీన్ ఉన్నా పాలను పచ్చిగా తాగడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇ-కోలి, కాంపిలోబాక్టర్, ఎర్సినియా, బ్రుసెల్లా, కొక్సిల్లా, లిస్టేరియా లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఈ పాలలో ఉంటుంది. పచ్చిపాలు తాగడం వల్ల శారీరక అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. పాశ్చరైజ్ చేయని పాలను తాగడం వల్ల పాలలో బ్యాక్టీరియా మెదడు, గుండె సమస్యలు వస్తాయి.

కొన్నిసార్లు పాలలో ఉండే బ్యాక్టీరియా వల్ల ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. దయచేసి పిల్లలకు పచ్చి పాలు తాగించకండి అని వైద్యులు సైతం చెబుతున్నారు. పచ్చిపాలు తాగేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పచ్చిపాల వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. పచ్చిపాలు ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలిగిస్తాయని చెప్పవచ్చు.

పచ్చిపాలు తాగడం వల్ల జ్వరం, అతిసారం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటి జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పచ్చిపాలు తాగడం వల్ల దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు వస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పచ్చిపాలను తాగకపోవడమే మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.