మనలో చాలామంది పచ్చిపాలు తాగడానికి ఎంతో మంచివని భావిస్తారు. పచ్చిపాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయని ఫీలవుతారు. అయితే పచ్చిపాలు తాగడం వల్ల కొన్ని లాభాలు ఉన్నా ఎక్కువ శాతం నష్టాలు ఉండటం గమనార్హం. పచ్చిపాలు తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చాలామంది ఫీలవుతారు. ప్యాకెట్ పాలలోని పాలు తాగినా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
పచ్చిపాలలో సాల్మొనెల్లా, ఇ-కొలి, లిస్టెరియా మోనోసైటోజెనెస్ వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉండటం వల్ల పిల్లలకు జ్వరం, అతిసారం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్యతో బాధ పడేవాళ్లు పచ్చిపాలు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించే అవకాశాలుంటాయి.
పాల పదార్థాలు అంటే కొంతమందికి అలర్జీ లాంటి సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎలర్జీతో బాధ పడేవాళ్లను దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. పాశ్చరైజేషన్ ప్రక్రియలో కొన్ని పోషకాలు నాశనం కావడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి.
పచ్చి పాలలో పశువులకు ఇచ్చే హార్మోన్లు, యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉండవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ అవశేషాలు మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చిపాలను తాగడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పచ్చిపాలను తాగకపోవడమే మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు.