పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరుద్యోగులకు తాజాగా తీపికబురు అందించింది. 183 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
విభాగాల వారీగా ఈ ఉద్యోగ ఖాళీలు ఉండగా డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంసీఏ, సీఏ, పీజీ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీబీఎం పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 2023 సంవత్సరం మార్చి 31వ తేదీ సమయానికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. రూల్స్ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపులు ఉండగా ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు ఐదేళ్లు, 1984 అల్లర్ల బాధిత వర్గాలకు చెందిన వాళ్లకు ఐదేళ్లు వయో సడలింపులు ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు 150 రూపాయలు కాగా మిగిలిన వాళ్లకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలుగా ఉండనుంది.
రాతపరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 78230 రూపాయల వరకు వేతనంగా లభించే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ పరీక్షకేంద్రాలు కాగా ఏపీలో గుంటూరు , కర్నూలు , విజయవాడ , విశాఖపట్నం పరీక్ష కేంద్రాలుగా ఉంటాయి.
జులై నెల 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.