ప్రముఖ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ.2.20 లక్షలు పొందే ఛాన్స్!

ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ తమ కస్టమర్లకు తీపికబురు అందించింది. ఎక్కువ వడ్డీ అందించే స్కీమ్ ను కస్టమర్ల కోసం ఈ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. ధనలక్ష్మి స్కీమ్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఎక్కువ వడ్డీ లభించనుంది. ఈ స్కీమ్ గడువు కొన్నిరోజుల క్రితమే ముగిసినా తాజాగా ఈ స్కీమ్ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు బ్యాంక్ నుంచి ప్రకటన వెలువడింది.

2024 సంవత్సరం జనవరి 1వ తేదీ వరకు ఈ స్కీమ్ అమలు కానుందని సమాచారం అందుతోంది. 7.4 శాతం వడ్డీ రేటుతో ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ లో సీనియర్ సిటిజన్లకు 7.9 శాతం వడ్డీ లభిస్తుండగా సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీ లభించనుంది. ఈ స్కీమ్ లో 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత 2 లక్షల 20 వేల రూపాయలు లభిస్తాయి.

కనీసం 500 రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా పొందే అవకాశం అందుతోంది. సమీపంలోని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ తో పాటు ప్రముఖ బ్యాంక్ లలో కొన్ని బ్యాంక్ లు సైతం ఇదే తరహా స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ బ్రాంచ్ లు పరిమితంగా ఉండగా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చెయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ఎక్కువ మొత్తంలో సేవింగ్స్ చేస్తే ఎక్కువ మొత్తంలో లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు.