దేశంలో రైతుల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే. పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతుండటంతో రైతులకు భారీ స్థాయిలో లాభాలు దక్కడం లేదు. అయితే ప్రముఖ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఈ బ్యాంక్ తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రైతులకు తీపి కబురు అందించాయి.
కృషి తత్కాల్ రిన్ స్కీమ్ ద్వారా రైతులు 50,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశం అయితే ఉందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగిన రైతులు సులభంగా ఈ రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందిన రుణంలో 25 శాతం రుణాన్ని సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ రుణాన్ని ఐదు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించే ఛాన్స్ ఉంటుంది.
సరిగ్గా రీ పేమెంట్ చేస్తున్న రైతులు మాత్రమే ఈ రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. తత్కాల్ లోన్ స్కీమ్ రైతులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా ఏకంగా లక్ష రూపాయల వరకు రుణం పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా సులువుగా ఈ రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే.
సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సరైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలకు వడ్డీ కూడా తక్కువగానే ఉంటుందని సమాచారం అందుతోంది. రైతులు ఈ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మంచిది.