సాధారణంగా దొంగలు ఇళ్లల్లో దుకాణాల్లో చోరీలకు పాల్పడటమే కాకుండా రోడ్డు మీద వెళ్లే వ్యక్తుల వద్ద కూడా దొంగతనాలు చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది రోడ్డు మీద వెళ్లే వాహనాలను ఆపి మరి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలా సరుకుతో వెళ్తున్న లారీల నుండి కూడా కొంతమంది దొంగతనాలు చేస్తూ ఉంటారు. తాజాగా రోడ్డు మీద గోధుమల బస్తాలతో లోడ్ అయి ఉన్న ట్రక్కు నుండి ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి చేసిన ప్రయత్నం ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాలలోకి వెళితే…పంజాబ్ లోని ముక్త్సర్ లో గోధుమ బస్తాలతో నిండి ఉన్న ఒక లారీ నుండి ఒక యువకుడు రెండు గోధుమ బస్తాలను దొంగలించటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ యువకుడు బస్తాలను దొంగలిస్తున్న సమయంలో లారీ డ్రైవర్ కి హెల్పర్ గా ఉన్న వ్యక్తి కంట పడ్డాడు. దీంతో దొంగతనానికి పాల్పడిన యువకుడిని హెల్పర్ పట్టుకొని చితకబాదాడు. అంతేకాకుండా ఆ దొంగను పట్టుకొని లారీకి ముందు భాగంలో ఉన్న బోన్నెట్ కి తాటితో కట్టి అలాగే పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లాడు.
ఇలా రోడ్డుమీద వెళుతున్న సమయంలో ఆ దొంగ భయంతో చచ్చినంత పని అయ్యింది. పొరపాటున తాడు ఊడిపోతే ఆ వాహనాల కింద పడి ఆ దొంగ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చివరకు పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత హెల్పర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం నేరం కింద పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The helper of the truck driver tied the youth in front of the truck over stealing 2 sacks of wheat in #Muktsar. pic.twitter.com/Wfy8osQyvA
— Nikhil Choudhary (@NikhilCh_) December 11, 2022