Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ కు టాలీవుడ్ బాలీవుడ్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్ కు క్రేజ్ ఉంది. చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో పంజాబ్ లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.
పంజాబ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో హైవేని ఆనుకొని ఉన్న గోడంతా కూడా ప్రభాస్ సినిమా పోస్టర్లతో నిండిపోయింది. ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్ నుంచి బాహుబలి 2 వరకు అన్ని సినిమాల పోస్టర్లను ఒక ఆర్డర్ లో అతికించి పంజాబ్ అభిమానులు డార్లింగ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ పోస్టర్లన్సీ తెలుగులోనే ఉండడం గమనార్హం. ప్రభాస్ నటించిన చాలా సినిమాలు హిందీలో రిలీజ్ కాలేదు. బాహుబలి నుంచే ఆయన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి.
LPU Punjab Prabhas Fans 🤗👌🔥
Throw Back 2017 400 Feet Flexy 🤗🔥♥️
#2018 More Then 400+ Flexy Loading..! 👐😇#RebelstarBirthdayCDP#RebelstarBirthdayMonth #Prabhas #Saaho #Prabhas20 😊🤗 pic.twitter.com/Y4ImZZvKtN— 𝐑𝐚𝐣 𝐒𝐡𝐢𝐯𝐚 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 (@ImRajShiva) October 21, 2018
అయితే పంజాబ్ లో మాత్రం మొదటి సినిమా ఈశ్వర్ నుంచి పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ పంజాబ్ అని కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్టర్స్ ఇప్పుడు వేసినవి కాదు.. 2018 లో వేసినవి. కానీ ప్రభాస్ అభిమానులు మళ్లీ ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన ప్రభాస్ అభిమానులు ముచ్చట పడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
