ఆధునిక ప్రపంచంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా పోటీ పడుతూ జనజీవనం ముందుకు సాగిపోతుంది. మార్పు అనేది అన్నిటిలోనూ మంచిదిగా ఉండదు… కొన్నిటిలో దానివలన ఇబ్బందులు వస్తుంటాయి. ఉదాహరణకి ప్రస్తుతం ప్రజల ఆహారపు అలవాట్లలో భారీ మార్పులు ఏర్పడినాయి . ప్రతిరోజూ రాత్రి 8 గంటల లోపే భోజనం చేయాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఉద్యోగులు, వ్యాపారులలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకుంటున్నారు. విద్యార్థులు, యువతలో చాలామంది టీవీలు, మొబైల్ ఫోన్ల వల్ల రోజూ ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి 8 గంటల తరువాత ఆహారం తీసుకుంటే శరీరంలో బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుతుంది. ఆలస్యంగా భోజనం చేసేవాళ్లు శరీరంలో కొవ్వు శాతం పెరగడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రాత్రిలో సమయం దాటాక స్నాక్స్ కూడా తినవద్దని, స్నాక్స్ తిన్నా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. గ్యాస్ సమస్య రావటానికి కూడా లేట్ గా భుజించటమనేది ఒక కారణమని తెలుస్తుంది. తినేటప్పుడు నీటిని త్రాగటం వల్ల ఆహరం జీర్ణమయావటానికి కావాల్సిన ద్రవాలు ఎక్కువ మోతాదులో విడుదలవటం వలన గ్యాస్ వస్తుంది. శరీరంలోని చాలా సమస్యలకు గ్యాస్ కారణం కాబట్టి సరైన సమయానికి భోజనం చేయాలి… అదేవిధంగా ఆహరం బాగా నమిలి తినటం వాళ్ళ చాలా త్వరగా జీర్ణమవుతుంది.
రాత్రి పూట సుష్టిగా తినకుండా కొంచెం తక్కువగా తీసుకోవటమే ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. రాత్రి భోజనానికి, నిద్రకు కనీసం రెండు నుంచి మూడు గంటల తేడా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారాన్ని ప్రతి రోజు సరైన సమయానికి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే సమయం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఫోన్స్ పక్కనెట్టేసి కంటికి కాసింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వటం చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి.