తెలంగాణ గవర్నర్ తో విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్..

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై తో విందులో పాల్గొన్నారు. గత కొంతకాలం నుండి వీరి మధ్య బాగా విభేదాలు రావటంతో గత తొమ్మిది నెలలుగా కేసీఆర్ రాజ్ భవన్ కు కూడా వెళ్లలేదు. ఇక తాజాగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయన్ చేత తమిళిసై ప్రమాణం చేయించారు.

ఇక దీనికి కేసీఆర్ వస్తారా లేదా అన్న అనుమానంతో రాజ్ భవన్ కి వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక గవర్నర్, ముఖ్యమంత్రి తమ గొడవలను పక్కకు పెట్టి కలిసిపోయారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఇద్దరూ కలిసి విందుభోజనం లో పాల్గొన్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కూడా మాట్లాడారు.