భోజనం విషయంలో చేయకూడని తప్పులు ఇవే.. ఈ తప్పులు చేస్తే కొంప కొల్లేరే!

మనలో చాలామంది భోజనానికి సంబంధించి తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేయడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. భోజనం చేసే సమయంలో కనీసం 20 నిమిషాల పాటు ప్లేట్ ముందు కూర్చోవాలి. మనం అలా కూర్చుంటే మాత్రమే మన కడుపు నిండిందని మెదడుకు సిగ్నల్ వెళ్తుంది. భోజనంకు నిద్రకు మధ్య 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉండాలి.

ఈ విధంగా గ్యాప్ ఉండటం వల్ల మెటబాలిజం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. పొట్ట చుట్టూ ఎక్కువ క్యాలరీలు ఉన్నవాళ్లు సరైన ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సరైన సమయానికి ఆహారం తీసుకోని పక్షంలో ఆకలి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎక్కువ మొత్తం ఆహారాన్ని ఒకే సమయంలో తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. శారీరక శ్రమకు అనుగుణంగా భోజనం తీసుకోవడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ అయితే ఉండదు. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఉదయం సమయంలో ఎక్కువగా మధ్యాహ్నం సమయంలో మితంగా రాత్రి సమయంలో తక్కువగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ విధంగా ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. బ్రేక్ ఫాస్ట్, భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.