టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో లేని సమయంలో ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉన్న సేవ తపాలా సేవ. ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలి అంటే ప్రతి ఒక్కరూ వినియోగించిన సేవ ఇది. అయితే ఇప్పుడు ఉన్న మొబైల్, ఈమెయిల్, ఆన్లైన్ సదుపాయాలతో తక్కువ మంది కస్టమర్లు పోస్టల్ సేవలను వినియోగిస్తున్నారు. అలాంటి వారి కోసం పోస్టల్ శాఖ తరచూ ఏదో ఒక స్కీమ్, ఒక కొత్త ఆలోచనలతో ప్రజలకు దగ్గర అవుతోంది. ఇప్పటికే ఇప్పటికే రూ. 399 లతో రూ. 10 లక్షల బీమా, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్, కిసాన్ వికాస్ పత్రం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, టైమ్ డిపాజిట్స్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్స్, సేవింగ్ అకౌంట్స్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్నలు పొందుతోంది పోస్టల్ శాఖ. తాజాగా మరో అడుగు ముందుకు వేసి “పోస్ట్ ఇన్ఫో” అనే కొత్త యాప్ ని తయారు చేసింది. దీని ద్వారా కొత్తగా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకునే వారు ఇంటి వద్ద నుండే చేసుకోగల సదుపాయం కల్పించింది. దీనికి సంబంధించిన ఇతర సమాచారం కోసం 18002666868 ను రూపొందించింది.
పోస్ట్ ఆఫీస్ కి వెళ్లకుండా ఖాతా తెరవాలి అనుకునేవారు ముందుగా పోస్ట్ ఇన్ఫో యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఖాతా తెరిచేందుకు అవసరమైన అన్ని వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి చిరునామా, ఇతర వివరాలు నమోదు చేసి సర్వీస్ రిక్వెస్ట్ పంపవలసి ఉంటుంది. ఎవరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ లతో పాటు పాస్ పోర్ట్ ఫోటోలను సిద్దం చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత తపాలా సిబ్బందే ఇంటికి వచ్చి ఖాతా తెరిపిస్తారు. ఈ యాప్ ద్వారా తొమ్మిది రకాల సేవలను కల్పిస్తున్నారు. దీని ద్వారా ప్రీమియం, వివిధ రకాల వడ్డీ రేట్లను సైతం తక్షణమే తెలుసుకోవచ్చు.
ఈ యాప్ లో వివరాలను నమోదు చేసిన అనంతరం పోస్టల్ శాఖ ఉద్యోగి మీ ఇంటికి వస్తారు. అకౌంట్ తెరిచేందుకు అవసరమైన ఫారాన్ని పూర్తి చేయడానికి వారు సహకరిస్తారు. అనంతరం ఫారం దానికి అవసరమైన ఫారం, డబ్బును వారే తీసుకువెళ్లి పోస్ట్ ఆఫీసులో జమ చేస్తారు. ఆ తర్వాత ఖాతా బుక్కు ని సైతం వారే ఇంటికి వచ్చి అందజేస్తారు. ఇదివరకే పోస్టల్ ఖాతా ఉన్నవారు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ లో రికరింగ్ డిపాజిట్, ఫిక్సెడ్ డిపాజిట్ (టైం డిపాజిట్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వివరాలు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. మీకు పోస్టల్ సర్వీసుల గురించి ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోవాలి అంటే పైన తెలిపిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి.