పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ అదిరిపోయే బెనిఫిట్స్ ఇవే.. ఈ విషయాలు తెలుసా?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ ద్వారా మహిళలకు ఎంతగానో ప్రయోజనాలు చేకూరనున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ ప్రయోజనకరంగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం రెండో విడతకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

300 కంటే ఎక్కువ సంఖ్యలో కంపెనీలలో లక్ష కంటే ఎక్కువగా ఇంటర్న్ షిప్ అవకాశాల కోసం మార్చి నెల 12వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్న్ షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.

టాప్ 500 కంపెనీలలో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలు కానుంది. ఇంటన్ర్ షిప్ కు ఎంపికైన వాళ్లకు నెలకు 5000 రూపాయల చొప్పున స్టైఫండ్ లభించనుంది. కంపెనీలో చేరే ముందు వన్ టైం గ్రాంట్ కింద 6,000 రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఏకంగా 66,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంది.

ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వాళ్లు వాస్తవ ఉద్యోగ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్ షిప్ లో చేరేవాళ్లకు కేంద్రం వేర్వేరు పథకాల ద్వారా బీమా చెల్లించడం జరుగుతుంది. 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఇంటర్న్ షిప్ కు అర్హత కలిగి ఉంటారు. ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.