పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రామ సురక్ష యోజన పేరుతో ఒక పోస్టాఫీస్ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. 19 సంవత్సరాల వయస్సు పై బడిన వాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు.
నెలకు కేవలం 1500 రూపాయలు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా ఏకంగా 31 లక్షల రూపాయల నుంచి 35 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. కనీస హామీ మొత్తం 10 లక్షల రూపాయల వరకు ఉండగా 80 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికితే ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు లోన్ కూడా పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
అవసరం అనుకుంటే పాలసీని సరెండర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 19 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 1515 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు మెచ్యూరిటీ తర్వాత 31 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు
రోజుకు 50 రూపాయలు పొదుపు చేయడం ద్వారా కళు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమవుతాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమవుతున్నాయి. ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.