స్థిరమైన ఆదాయాన్ని పొందాలని భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిదనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ స్కీమ్ లో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.2.24 లక్షలు వడ్డీ పొందే అవకాశం అయితే ఉండనుందని సమాచారం అందుతోంది.
ఈ స్కీమ్ కు ఎలాంటి ఏజ్ లిమిట్ లేకపోవడంతో సులువుగానే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ లో ఐదు సంవత్సరాల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. కనీసం 1000 రూపాయల నుంచి ఎంతైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశం ఉండగా ఆదాయాన్ని బట్టి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఎఫ్‌డీ పాలసీ గడువును పెంచుకునే అవకాశాన్ని పాలసీదారుకి పోస్టాఫీస్ కల్పిస్తున్న నేపథ్యంలో అవసరం అనుకుంటే మరో ఏడాదిన్నర కూడా పాలసీ గడువును పెంచుకోవచ్చు.
అత్యవసరమైతే మెచ్యురిటీ ముందు కూడా ఎఫ్‌డీని క్లోజ్ చేసుకునే అవకాశం అయితే ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అకౌంట్ ను ప్రీ క్లోజ్ చేస్తే మాత్రం వడ్డీ రేట్లు మారతాయని తెలుస్తోంది. సంవత్సరం లోపే ఎఫ్‌డీని క్లోజ్ చేస్తే పోస్టాఫీస్ అందించే సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్లు వర్తించే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ స్కీమ్స్ లో డిపాజిట్ చేస్తే పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 7.5 శాతం వడ్డీ రేటు లభించనుంది. ఒకవేళ రూ.7 లక్షలు ఎఫ్‌డీ చేస్తే వడ్డీ రూ.3,37,461 పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.