ఎల్ఐసీ నుంచి మరో సూపర్ పాలసీ.. రోజుకు రూ.55తో రూ.10 లక్షల ఆదాయం సులువుగా పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఈ పాలసీల వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. జీవిత బీమాతో పాటు భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించే పాలసీని తీసుకోవాలని భావించేవాళ్లు ఎల్ఐసీ జీవన్ అమర్ పాలసీని తీసుకుంటే మంచిది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ పొందాలని భావించే వాళ్లకు జీవన్ అమర్ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు.

రోజుకు కేవలం 55 రూపాయలు చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత 10 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ ప్రయోజనాలు పొందాలని భావించే వాళ్లు ఈ పాలసీపై దృష్టి పెడితే మంచిది. ఈ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ల కుటుంబ సభ్యులకు డెత్ బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

8 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. గరిష్టంగా 30 సంవత్సరాల వరకు గడువును ఎంచుకునే అవకాశం ఉండగా కనీసం రూ.2 లక్షల సమ్ అష్యూర్డ్ ఉండాలి. గరిష్టంగ ఎంత మొత్తానికైనా పాలసీ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది.

40 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీ తీసుకుంటే 20 ఏళ్ల టర్మ్ తో 10 లక్షల రూపాయలకు పాలసీ తీసుకున్న వాళ్లు సంవత్సరానికి 20000 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారు చనిపోతే నామినీ 10 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.