వాళ్లకు ఏకంగా 10 లక్షల రూపాయలు ఇస్తున్న మోదీ సర్కార్.. ఎలా పొందాలంటే?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు ప్రజలకు మేలు చేసేలా పథకాలను అమలు చేస్తూ ఆ పథకాల వల్ల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్లే, భారతీయ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ప్రవాసి భారతీయ బీమా యోజన పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా ఇతర దేశాల్లో పని చేసే మన దేశ వర్కర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభించే ఛాన్స్ ఉంటుంది.

ఆన్ లైన్ లో ఈ స్కీమ్ కు సంబంధించి రెన్యూవల్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రమాదవశాత్తూ చనిపోయినా శాశ్వత అంగవైకల్యం సంభవించినా ఆ వ్యక్తి కుటుంబం 10 లక్షల రూపాయలు పరిహారంగా పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు విదేశాల్లో జాబ్ కోల్పోయినా 10 లక్షల రూపాయలు పరిహారంగా పొందవచ్చు.

ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు అనారోగ్యం బారిన పడినా గాయాల పాలైనా లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈసీఆర్ దేశాలుగా ఉన్న దేశాలకు వెళ్లే వాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ దేశాలకు వెళ్లే మన దేశ వాసులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందటానికి అన్ని విధాలుగా అర్హత కలిగి ఉంటారు.

18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2 సంవత్సరాల పాలసీకి ప్రీమియం రూ.275 (ప్లస్ టాక్స్) కాగా 3 సంవత్సరాల పాలసీకి ప్రీమియం రూ.375 (ప్లస్ టాక్స్) ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు దరఖాస్తు చేసుకున్న వాళ్లు చేసుకున్న వాళ్లు మరణిస్తే అవసరమైన సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.