ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే భార్యాభర్తలిద్దరికీ పెన్షన్.. అదిరిపోయే స్కీమ్ అంటూ?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న ఎన్నో పాలసీలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. నాన్ లింకెడ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ అయిన ఎల్ఐసీ జీవన్ సరళ్ పాలసీ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. డెత్ బెనిఫిట్స్ తో పాటు మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో నగదు కూడా పొందే పాలసీ కావడంతో ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుంది.

పాలసీదారు అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించే పాలసీలలో ఈ పాలసీ కూడా ఒకటి కాగా సమ్ అష్యూర్డ్ ప్లస్ రివర్షనరీ బోనస్‌లు, టెర్మినల్ బోనస్‌లను ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. పాలసీ దారుని కుటుంబం వారు లేనప్పుడు కూడా ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా ఇది ఉపయోగపడుతుంది. ప్రీమియం చెల్లింపు ఎంపికలలో సౌలభ్యం ఉండటంతో ఈ పాలసీ ద్వారా మేలు జరుగుతుంది.

రక్షణ , పొదుపు కలయిక కోసం చూస్తున్న వ్యక్తులకు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్న వ్యక్తులకు ఇది అనుకూలమైన పాలసీ అని చెప్పవచ్చు. సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపు ఎంపిక కోసం చూస్తున్న వ్యక్తులకు కూడా ఈ ప్లాన్ బెస్ట్ ప్లాన్ అవుతుంది. ఒక వ్యక్తి 20 సంవత్సరాలకు ఈ పాలసీ 10 లక్షల రూపాయలకు తీసుకుంటే 15 సంవత్సరాల తర్వాత 15.5 లక్షల రూపాయలు లభిస్తుంది.

ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసి పెన్షన్ కూడా పొందవచ్చు. ఈ పాలసీలో భారీ మొత్తం పెట్టుబడిగా పెట్టడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు.