మనలో చాలామంది తాగే నీళ్ల విషయంలో భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు. కొంతమంది ఎక్కువగా నీళ్లు తాగితే మంచిదని చెబితే మరి కొందరు మరీ ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరానికి హాని కలిగే అవకాశం అయితే ఉంటుందని చెబుతున్నారు. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నీళ్లకు సంబంధించి ఒక పరిశోధన చేసి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
నీళ్లు తక్కువగా తాగేవాళ్లు చిన్న వయస్సులోనే మరణించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయట.శరీరం డీ హైడ్రేషన్ కు గురి కావడం వల్ల కలిగే నష్టాలు అన్నీఇన్నీ కావు. ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో నీళ్లు ఎంతగానో తోడ్పడతాయి.
45 నుండి 66 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి తక్కువగా నీళ్లు తాగేవాళ్లు చనిపోతారని చెబుతున్నారు. తక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం లెవెల్స్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రక్తంలో ఎక్కువ సోడియం ఉన్నవాళ్లను హైబీపీ, కొలెస్ట్రాల్, మధుమేహం ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి.
తాగే నీళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లను కాచి చల్లార్చి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వఛే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లను తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. మినరల్ వాటర్ కంటే కాచి చల్లార్చిన వాటర్ ను తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు.