కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా పిఎం విశ్వకర్మ యోజన పేరుతో కేంద్రం అమలు చేస్తున్న ఒక స్కీమ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ పోందే అవకాశం అయితే ఉంది. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ఈ స్కీమ్ కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ, వార్డ్ సచివాలయాలు అందుబాటులో లేనివారు కామన్ సర్వీసెస్ సెంటర్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 3 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా పొందిన రుణానికి వడ్డీ కేవలం 5 శాతం మాత్రమే కావడం గమనార్హం. గతేడాది నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. సంప్రదాయ చేతి వృత్తుల పనులు చేసేవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్ వాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
2028 సంవత్సరం వరకు ఈ స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్ తో పాటు గుర్తింపు కార్డు సైతం లభిస్తుంది. కళాకారులతో పాటు చేతివృత్తులకు సంబంధించిన పనులు చేసేవాళ్లకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అవసరమైన పనిముట్లను అందజేస్తారు. అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎం విశ్వకర్మ స్కీమ్ వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.