ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఈ సర్వీస్ కమిషన్ అడుగులు వేసింది. లోకల్ అభ్యర్థులతో పాటు నాన్ లోకల్ అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు నాన్ లోకల్ కేటగిరీలో ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ బీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.
www.opsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 39 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ ఆపరేషన్స్, అప్లికేషన్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
21 నుంచి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఓపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
నాన్ లోకల్ కేటగిరీ కింద కేవలం 5 శాతం ఉద్యోగ ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తున్న నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.