కేంద్రం సూపర్ స్కీమ్.. తక్కువ వడ్డీకే సులువుగా 2 లక్షల లోన్ పొందే అవకాశం?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త స్కీమ్ అమలు దిశగా అడుగులు వేస్తూ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఊహించని స్థాయిలో ప్రయోజనం కలిగిస్తోంది. ప్రధాని మోదీ విశ్వకర్మ్ స్కీమ్‌ పేరుతో ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. ఆగష్టు 15వ తేదీన ఈ స్కీమ్ కు సంబంధించిన ప్రకటన చేయగా కేంద్రం ఈ స్కీమ్ కోసం 13,000 కోట్ల రూపాయలు కేటాయించింది.

సాంప్రదాయ హస్త కళా నైపుణ్యాలను ప్రోత్సహించాలనే ఆలోచనతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. 30 లక్షల కుటుంబాలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలగనుందని తెలుస్తోంది. హస్త కళాకారులు ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందే అవకాశం ఉంటుంది. తొలి విడతలో లక్ష రూపాయలు లోన్ పొందే అవకాశం ఉండగా రెండో విడతలో ఏకంగా 2 లక్షల రూపాయల లోన్ పొందే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందిన మొత్తానికి 5 శాతం వడ్డీ రేటుగా ఉండనుందని సమాచారం అందుతోంది. కమ్మరి, లాండ్రీ కార్మికులు, క్షురకులతో పాటు నేత కారులు, స్వర్ణ కారులు ఈ స్కీమ్ ద్వారా సులువుగా లోన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందిన వాళ్లు ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందిన వాళ్లు స్కిల్ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ పొందే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్లు టూల్ కిట్ ఇన్సెంటివ్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో రెండు రకాల స్కిల్లింగ్ కార్యక్రమాలు ఉండగా ఈ కార్యక్రమాల కోసం శిక్షణ తీసుకుంటే రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ పొందే అవకాశం ఉంటుంది. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.