కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా ప్రస్తుతం 6,000 రూపాయలు రైతులు పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే రైతులకు తీపికబురు అందించేలా మోదీ సర్కార్ మరో కీలక అడుగు వేస్తోంది. ప్రస్తుతం దేశంలోని 10 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందుతుండటం గమనార్హం. త్వరలో ఈ స్కీమ్ కు సంబంధించి 14వ విడత డబ్బులు జమ కానున్నాయి.
దీపావళి పండుగ కానుకగా రైతుల ఖాతాలో నగదు జమ కానుందని సమాచారం అందుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా పొందే మొత్తాన్ని 8,000 రూపాయలకు పెంచనుందని తెలుస్తోంది. మరికొన్నినెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కేంద్రం రైతులకు చేసే సహాయాన్ని పెంచితే మాత్రం బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోదీ సర్కార్ రాబోయే రోజుల్లో రైతులకు మేలు జరిగేలా మరిన్ని స్కీమ్స్ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సైతం రైతుల కోసం వేర్వేర్ స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే మొత్తాన్ని రాబోయే రోజుల్లో మరింత పెంచుతాయేమో చూడాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగా తెలంగాణ సర్కార్ రైతుబంధు పేరుతో స్కీమ్ ను అమలు చేస్తున్నాయి. ఈ స్కీమ్స్ విషయంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.