ప్రస్తుత కాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మాత్రం వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను సులువుగా పెంచుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
జలుబు, దగ్గు, జ్వరం తరచూ వేధిస్తుంటే మాత్రం ఇమ్యూనిటీ పవర్ తగ్గిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పిజ్జా, పాస్తా, బర్గర్లు, ఫ్రైస్ లను తీసుకోకుండా ఉంటే మంచిది. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలని భావించే వాళ్లు సిట్రస్ పండ్లను తీసుకుంటే మంచిది.
సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు శరీర ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. బ్రోకలీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించడంలో ఇది తోడ్పడుతుంది. ఇవి తీసుకోవడం ద్వారా కాల్షియం, విటమిన్ సి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ లభిస్తాయి.
వెల్లుల్లి తీసుకోవడం ద్వారా అలిసిన్, అజోయేన్, థయోసల్ఫేట్ పదార్థాలు లభించి వైరస్ లకు చెక్ పడుతుంది. బ్యాక్టీరియా సంక్రమణ, ఫ్లూ లాంటి సమస్యలకు వెల్లుల్లి చెక్ పెడుతుంది. అల్లం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ లభిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో అల్లం ఉపయోగపడుతుంది. పసుపును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె జబ్బులు, కాన్సర్, అల్జీమర్స్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.