రావిచెట్టు ఆకుల వల్ల ఏకంగా ఇన్ని లాభాలున్నాయా.. ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

ఆధ్యాత్మికంగా రావిచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉందనే సంగతి తెలిసిందే. రావిచెట్టును భోది వృక్షం అని పిలుస్తారు. హిందువులు, బౌద్ధులు రావిచెట్టును పవిత్ర వృక్షంగా భావించడం జరుగుతుంది. రావిచెట్టులో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. రావి ఆకులు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయని చెప్పవచ్చు. రావి ఆకులు ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాము కాటు లాంటి సమస్యలను దూరం చేస్తాయి.

డయేరియా సమస్యతో బాధ పడేవారు రావి చెట్టు కాండం, ధనియాలు, పట్టిక బెల్లం సమానంగా తీసుకుని మిక్స్ చేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. రావి పండ్లు తీసుకోవడం వల్ల ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది. పిత్త దోషాలు, కడుపులో మంట, వాంతులు, దగ్గు, రక్త సంబంధ సమస్యలకు రావి పండ్లు చెక్ పెడతాయని చెప్పవచ్చు. రావి బెరడు, మగ్గిన పండ్లు ఆస్తమాకు చెక్ పెట్టవచ్చు.

రావి బెరడు, మగ్గిన పండ్లను సమానమైన మోతాదులలో కలిపి మూడు రోజులు తీసుకోవడం ద్వారా ఆస్తమా సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎండిన రావి పండ్లను పొడిగా చేసుకొని 14 రోజుల పాటు ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఆయుర్వేద వైద్యంలో రావి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రావిచెట్టు ఆకుల్లో కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్ వంటి మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ వంటి న్యూట్రియంట్లు ఉంటాయి.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పుష్కలంగా ఉన్న రావిచెట్టు ఆకుల జ్యూస్ తీసుకోవడం ద్వారా ఎలాంటి నష్టాలు ఉండవు. ఈ ఆకుల ద్వారా ఊపిరితిత్తులకు ఎంతో లాభం జరుగుతుంది. ఊపిరితిత్తుల స్వెల్లింగ్ సమస్యకు సైతం రావిచెట్టు ఆకుల జ్యూస్ సులభంగా చెక్ పెడుతుంది. అజీర్తి సమస్యతో బాధ పడేవారు రావిచెట్టు ఆకుల జ్యూస్ ను తీసుకుంటే మంచిది.