మనలో చాలామంది పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను విరివిగా వేసుకోవడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. డాక్టర్ సలహా లేకుండానే మనలో చాలామంది పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను వాడుతూ ఉంటారు. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చి చూస్తే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే జ్వరం వచ్చిందని భావించాల్సి ఉంటుంది. జ్వరం వచ్చిన వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.
శరీరంలో వైరల్, బ్యాక్టీరియా వల్ల సమస్యలు ఎదురైతే శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. జ్వరం వస్తే వైద్యులు సైతం మొదట పారాసెటమాల్ ట్యాబ్లెట్ వాడమని సూచిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీళ్లు, కండరాల నొప్పులతో బాధ పడేవాళ్లకు సైతం పారాసెటమాల్ చెక్ పెడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుంది.
పారాసెటమాల్ ట్యాబ్లెట్ వాడటం వల్ల అలర్జీ, అజీర్ణంతో పాటు వికారం, మగత, మైకం లాంటి సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. ఈ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడితే కిడ్నీ, లివర్, శ్వాస సమస్యలతో పాటు చర్మం, దురద, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయని చెప్పవచ్చు. కొంతమందికి తీవ్రమైన నష్టం కలిగే ఛాన్స్ ఉంటుంది.
పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను తగినంత మోతాదులో మాత్రమే వేసుకుంటే మంచిది. మోతాదు మించితే మాత్రం ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం లేదని చెప్పవచ్చు. తరచుగా పారాసెటమాల్ ట్యాబ్లెట్లను వినియోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.