పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంత ప్రమాదమా.. ఈ విషయాల గురించి మీకు తెలుసా?

ఈ మధ్య కాలంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్ వినియోగం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. తక్కువ ధరకే ఈ ట్యాబ్లెట్ అందుబాటులో ఉండటంతో పాటు ఎక్కువ వ్యాధులకు సులభంగా చెక్ పెట్టే ట్యాబ్లెట్ కావడంతో ఈ ట్యాబ్లెట్ ను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిన సమయంలో ఈ ట్యాబ్లెట్ వాడటానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు.

అయితే ఈ ట్యాబ్లెట్ ను పరిమితంగా వాడితే ఎలాంటి నష్టం లేదు కానీ ఎక్కువగా వాడితే మాత్రం అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. అయితే పారసిటమాల్ ట్యాబ్లెట్ వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలు సులువుగానే తగ్గినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. రక్తస్రావం, అలర్జీ, కాలేయ సమస్యలు, రక్తహీనత లాంటి సమస్యలకు ఈ ట్యాబ్లెట్ కారణమవుతుంది.

పారాసిటమాల్ ట్యాబ్లెట్ లను ఎక్కువగా వినియోగించేవారు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ తో 250ఎంజీ, 500 ఎంజీ, 650 ఎంజీ ఇలా వేర్వేరు మోతాదులలో ట్యాబ్లెట్లు ఉంటాయి. వయస్సును బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి తీసుకునే ట్యాబ్లెట్, మోతాదు మారే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మోతాదు తీసుకుంటే కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.

పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను తీసుకోవడం వల్ల కొన్నిసార్లు సీరియస్ అలర్జీ సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. తరచూ పారాసిటమాల్ ట్యాబ్లెట్లను తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. నోరు ఎండిపోవడం, తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు సైతం పారాసిటమాల్ వేసుకున్న వాళ్లను వేధించే అవకాశం ఉంటుంది.