ఛాతీలో నొప్పిగా, మంటగా అనిపిస్తోందా.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయా?

ప్రస్తుత కాలంలో ఛాతీలో నొప్పి, మంట సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి మొదలైతే చాలామంది తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కూడా కొన్నిసార్లు గుండెలో మంటగా అనిపించే అవకాశాలు ఉంటాయి. పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాలు కొన్నిసార్లు ఎసిడిటీని కలిగించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆస్తమా, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

గ్యాస్ సమస్య వల్ల ఛాతీలో ఎడమవైపు నొప్పి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పుల్లటి త్రేన్పులు ఎక్కువగా వస్తున్నా కడుపులో ఉబ్బరంగా ఉన్నా గుండెల్లో మంట వచ్చే అవకాశాలు ఉంటాయి. గుండెనొప్పి అయితే పడుకున్నా లేచినా నొప్పి ఒకేలా ఉంటుంది. పడుకున్న సమయంలో నొప్పి వీపు భాగంలో ఉంటే మాత్రం ఆ సమస్య అసిడిటీకి సంబంధించిన సమస్య అని భావించాల్సి ఉంటుంది.

ఛాతీలో నొప్పి ఉంటే కొన్నిసార్లు విపరీమైన చెమట పట్టడంతో పాటు వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలతో బాధ పడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. పల్చటి మజ్జిగ రెండు గ్లాసులు తీసుకోవడం ద్వారా ఛాతీ నొప్పిని దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే మార్కెట్ లో దొరికే ట్యాబ్లెట్ లేదా ఈనో లాంటి వాటిని వాడాల్సి ఉంటుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే బీరకాయ తినడం ద్వారా కూడా మంచి ఫలితాలను సులువుగా పొందవచ్చు. నీటిలో జీలకర్ర వేసి మరిగించి చల్లార్చి ఆ నీటిని తాగడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బరువులు ఎత్తితే కూడా కొన్నిసార్లు ఛాతీలో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఊపిరితిత్తులలో వాపు వస్తే కూడా గుండె నొప్పి ఉండే అవకాశం ఉంటుంది.