నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగ ఖాళీల భర్తీ!

రైల్వేలో ఉద్యోగం సాధించడం ఎంతోమంది కల అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైల్వే ఉద్యోగ ఖాళీల కోసం దేశంలోని లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పారా మెడికల్ కేటగిరీలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆగష్టు నెల 8వ తేదీన ఈ రిక్రూట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం.

16 సెప్టెంబర్ 2024 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలతో పాటు డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1376 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

దేశంలోని అన్ని ప్రముఖ రీజియన్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. https://indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండనుందని తెలుస్తోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఈబీసీ, ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. సెప్టెంబర్‌ 17 నుంచి 26 వరకు సమర్పించిన దరఖాస్తులలో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.