రైతులకు అదిరిపోయే తీపికబురు.. ఆ పంట వేస్తే క్వింటాల్ కు రూ.16 వేలు పొందే ఛాన్స్!

ఈ మధ్య కాలంలో పెట్టుబడులు పెరగడం వల్ల వ్యవసాయం చేసేవాళ్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఖర్చులు పెరుగుతున్న స్థాయిలో ఆదాయం పెరగడం లేదని రైతులు చెబుతున్నారు. ఆరుగాలం చెమటోడ్చి వ్యవసాయం చేస్తున్నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని రైతులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. అయితే మంచి రేటు ఉన్న పంటలు వేస్తే మాత్రం లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

పసుపు పంట వేసిన రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. క్వింటా పసుపుకు ఏకంగా 16,000 రూపాయల ఆదాయం వస్తోంది. ఎక్కువ మొత్తంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులు పసుపు పంటపై దృష్టి పెడితే కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రేట్ల విషయంలో మాత్రం రైతులు పూర్తిస్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

గత కొన్నేళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో ధర లేదని రైతులు చెబుతున్నారు. పసుపు పండే భూములలో పసుపును సాగు చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో పసుపు రేటు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పసుపు పండించడం ఎంతో కష్టమనే సంగతి తెలిసిందే.

ఇప్పటికే పసుపు పండించడంలో అనుభవం ఉన్న రైతులు పసుపు పంట సాగుపై దృష్టి పెడితే మంచిది. పెద్దగా లాభాలు అందించని పంటలు వేయడం కంటే పసుపు లాంటి లాభాలు అందించే పంటలపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. పసుపు సాగు చేసే రైతులు ఇంట్లో పంట ఉంటే వెంటనే అమ్ముకుంటే ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.