ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు రైల్వే శాఖ అదిరిపోయే తీపికబురు అందించింది. విజయవాడ డివిజన్ ఏటీవీఎంలో ఫెసిలిటేటర్ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడ డివిజన్ పరిధిలోని మొత్తం 26 రైల్వే స్టేషన్లలో 59 ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు కేవలం బోనస్ ఆధారితంగా కమిషన్ ద్వారా డబ్బులను సంపాదించే ఉద్యోగాలు కావడం గమనార్హం.
https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా జులై 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారాఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది.
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. మొత్తం26 రైల్వే స్టేషన్లలో 59 పోస్టులను భర్తీ చేయనుండగా విజయవాడ స్టేషన్ లో 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైతే ఎంపికైన వాళ్లకు 3 శాతం కమిషన్ లభించనుందని సమాచారం అందుతోంది.
అన్ రిజర్వ్ డ్ కేటగిరీలో టికెట్లను మిషన్ల ద్వారా జారీ చేయడం కోసం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.