ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఆ వ్యాధులు దూరమవుతాయా?

ఈ మధ్య కాలంలో వైద్యులు ఇతర వంటనూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్ ను వాడాలని సూచిస్తుండగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆలివ్ ఆయిల్ ను ఎక్కువసార్లు వేడి చేసినా ఈ ఆయిల్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గుండెపోటు ప్రమాదాలను తగ్గించే విషయంలో ఆలివ్ ఆయిల్ ఎంతగానో సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్ లో యాంటీఆక్సిడెంట్ గుణాలతో పాటు యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఆలివ్ ఆయిల్ తోడ్పడుతుంది. బీపీ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆలివ్ నూనెను పరిమితంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.

ఆకలి కోరికలను నియంత్రించడంలో ఆలివ్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆలివ్ ఆయిల్ లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ ఎఫెక్ట్స్ వల్ల దీర్ఘకాలిక మంట, నొప్పులు లాంటి సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి సహాయపడటంలో ఆలివ్ ఆయిల్ తోడ్పడుతుంది.

మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. న్యూరలాజికల్ వ్యాధులకు చెక్ పెట్టడంలో ఆలివ్ అయిల్ ఉపయోగపడుతుంది. మెదడులో ఆక్సీకరణ, వాపును తగ్గించడంలో ఈ ఆయిల్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.