డీఆర్డీవో నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. mhrdnats.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీలో అప్రెంటీస్ పోస్టుల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 31,000 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
2023 సంవత్సరం జూన్ నెల 24వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం మొదలు కాగా 2023 సంవత్సరం జులై 8వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 28 ఉండగా డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 23, ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 11 ఉన్నాయి.
అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు పోలీసు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలుస్తోంది. https://www.drdo.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం డీఆర్డీవో నుంచి జాబ్ నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
ఉద్యోగ ఖాళీల ఆధారంగా అర్హతలలో మార్పులు ఉంటాయి. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీగా బెనిఫిట్ కలుగుతోంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.