డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా), ట్రేడ్ ఐటీఐ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ కింద ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 80 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ రిలీజైన తర్వాత 15 రోజుల్లోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 15 ఉండగా టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 10, ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 65 ఉన్నాయి. సంబంధిత ట్రేడ్/సబ్జెక్ట్‌లో డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాలకు అర్హులు.
సంబంధిత ట్రేడ్/విభాగాలలో డిప్లొమా కలిగి ఉన్నవాళ్లు టెక్నీషియన్ (డిప్లొమా) ఉద్యోగ ఖాళీలకు అర్హులు. సంబంధిత ట్రేడ్/విభాగాలలో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 9000 రూపాయలు వేతనం లభించనుంది. టెక్నీషియన్ (డిప్లొమా) ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 8000 రూపాయల వేతనం లభించనుందని భోగట్టా.
ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 7000 రూపాయల వేతనం లభించనుంది. డైరెక్టర్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్ లాబొరేటరీ, కంచన్ బాగ్ అడ్రస్ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుందని తెలుస్తోంది.