డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. rac.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 51 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అక్టోబర్ 21, 2023 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలలో సైంటిస్ట్ ఎఫ్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా సైంటిస్ట్ ఇ ఉద్యోగ ఖాళీలు 14, సైంటిస్ట్ డి ఉద్యోగ ఖాళీలు 8, సైంటిస్ట్ సి ఉద్యోగ ఖాళీలు 27 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 67,700 రూపాయల నుంచి 1,31,100 రూపాయల వరకు వేతనం లభించనుంది. సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
భారీ వేతనం ఆఫర్ చేస్తుండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ సైతం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
డీఆర్డీవోలో ఉద్యోగం సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే. ఎంతో కష్టపడితే మాత్రమే డీఆర్డీవోలో ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం హార్డ్ కాపీని మన దగ్గర ఉంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.