నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం. సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
గతేడాది గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఒకింత టఫ్ కాంపీటీషన్ ఉండే అవకాశం ఉంది. ఈ జాబ్స్ కు ఎంపికైన వాళ్లకు దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో ప్రయోజనం కలగనుంది.
డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు దీర్ఘకాలంలో నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు చేయనున్నాయని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలిగించనున్నాయి.