మనలో చాలామంది వేప ఆకులను వేర్వేరు అవసరాల కోసం వినియోగిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్నానం చేసే సమయంలో వేప ఆకులు వేసిన నీటితో స్నానం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే ఇలాంటి నీటితో స్నానం చేస్తారో వాళ్లకు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా తగ్గుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
వేప ఆకులు, బెరడు, పువ్వు, కాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఆయుర్వేదంలో సైతం వేపకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. వేపలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండగా శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో వేప ఆకులు తోడ్పడతాయి. వేప ఆకులు శరీరానికి హానీకరమైన ప్రీ రాడికల్స్‌తో పోరాడటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
స్కిన్ ఇన్‌ఫెక్షన్ సమస్యలతో బాధ పడేవాళ్లు వేపనీటితో స్నానం చేయడం ద్వారా ఈ సమస్యను సులువుగానే దూరం చేసుకోవచ్చు. వేప ఆకు నీళ్లతో స్నానం చేస్తే మొటిమల సమస్య తక్కువ సమయంలోనే తొలగిపోతుంది. ముఖంపై మచ్చల సమస్యతో బాధ పడేవాళ్లు వేప ఆకులతో స్నానం చేస్తే ఆ మచ్చలు తొలగిపోయే అవకాశాం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కంటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా మంట ఉంటే వేపాకు నీళ్ల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఇన్ఫెక్షన్, కళ్లు ఎర్రబడడం, కంటి వాపు వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో వేపాకు నీళ్లు తోడ్పడతాయి. చుండ్రు బాధితులకు కూడా వేప సులువుగా చెక్ పెట్టవచ్చు. వారానికోసారి వేప ఆకు నీటితో తలస్నానం చేస్తే చుండ్రు లాంటి సమస్యలు దూరమవుతాయి.