సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు విభాగాల్లో ఉన్న అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కార్పెంటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్స్ మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ మెకానిక్, ఫిట్టర్, మెషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్ ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
మెకానిక్ ఏఆర్సీ, ఎం.ఎం.డబ్ల్యూ, స్టెనో ఇంగ్లీష్, స్టెనో హిందీ, డీజిల్ మెకానిక్, టర్నర్, వెల్డర్, వైర్ మెన్, కెమికల్ లాబొరేటరీ అసిస్టెంట్, డిజిటల్ ఫోటోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐటీఐ, పదో తరగతి, ఇంటర్ అర్హత ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
2025 సంవత్సరం మార్చి 25 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయవచ్చు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మార్చి నెల 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ప్రయోజనాలను పొందవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.